![]() |
![]() |

దుబాయ్ బ్యూటీ, బిగ్ బాస్ కంటెస్టెంట్ హమీద తన హ్యాపీనెస్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. హమీద సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని, క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్‌బాస్ 5 లో కంటెస్టెంట్స్ యాంకర్ రవి, హమీద, శ్రీరామ్ ఇలా ఒక గ్యాంగ్ లా ఉండేవారు. ఇక హౌస్ లో సింగర్ శ్రీరామ్, హమీదకు మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది.
దీపావళి సందర్భంగా హమీద ఖరీదైన కొత్త బెంజ్ కారు కొనుక్కుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది హమీద. ఈ ఫోటోల్లో చూస్తే హమీద కుటుంబ సభ్యులతో పాటు యాంకర్ రవి ఫ్యామిలీ కూడా ఉంది. కారు కొన్న తర్వాత వీరంతా డ్రైవ్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ సందర్భంగా రవి.. కారు ఫోటో, వీడియోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. "వెల్‌కమ్ ది బీస్ట్.. కంగ్రాట్యూలేషన్స్ హమీలు.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. నీ న్యూ ప్రాజెక్ట్ కు ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా డ్రైవ్ చేయ్" అంటూ పోస్ట్ చేశాడు.
హమీద కారు కొనడంపై సింగర్ శ్రీరామచంద్ర కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టేసరికి అందుకు హమీద.. థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే యాని మాస్టర్, అరియనా గ్లోరీ, యాంకర్ శివ ఇలా అందరూ హమీదకి విషెస్ చెప్పారు. ఏదేమైనా ఈ ఏడాది బుల్లితెర, బిగ్ బాస్ స్టార్స్ చాలా మంది రకరకాల కార్లను కొనుక్కున్నారు.
![]() |
![]() |